వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల

వైయస్ షర్మిల

1
TMedia (Telugu News) :

వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల
– వైయస్ షర్మిల

టీ మీడియా,జులై 22, గోదావరిఖని :

నష్టపోయిన ఇండ్లకి, పంటలకు టిఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద భావిత కుటుంబాలకు 25 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ జిమ్మి బాబు ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని న్యూ పోరట్ పల్లిలో వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు పర్యటించి వరద బాధిత కుటుంబాలను వైఎస్.ఆర్ షర్మిల పరామర్శించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల ఇండ్లను,పంట పొలాలు ముంపుకు గురయ్యేలా చేశారని,వేలాదిమంది నిరాశ్రయులయ్యారని,వేల ఎకరాల పంటలు రైతులు నష్టపోయారని దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

 

Also Read : లీలమ్మ గిదేదమ్మ

 

రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి,వేపూరి సోమన్న,సత్యవతి,జిల్లా అధ్యక్షులు మొలుగూరి సుదర్శన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ.ఎల్.రెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి జిమ్మీ బాబు, రామగుండం నియోజకవర్గ వైయస్సార్ టిపి నాయకులు బూడిద బానేష్,మల్లేష్ యాదవ్, కుడిదల వెంకట్,రేగుల నరేష్,శాంసన్,శరన్ నవీన్, ప్రదీప్,బూడిద రవీందర్,సామ్యూల్, బండ సతీష్,కన్నం మహేందర్, పల్లె శ్రీకాంత్,
మహిళ నాయకురాలు, సంబోధి సుశీల,ఎండి.ఫాతిమా,జి.సుజాత,లత, బాదే శ్యామల,జి.సమ్మక్క, శివాని,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube