కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి

- వేల్పుల కుమారస్వామి

0
TMedia (Telugu News) :

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి

– వేల్పుల కుమారస్వామి

టీ మీడియా, డిసెంబర్ 5, గోదావరిఖని : సిఐటియు పెద్దపల్లి జిల్లా3వ మహాసభలు డిసెంబర్ 10,11 తేదీల్లో ఏన్టీపీసీ లోని టి.వి.గార్డెన్ లో జరుగబోతున్నాయని అన్నారు.ఈ మహాసభల సందర్భంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు జెండావిష్కరణలకు పిలుపివ్వడం జరిగింది. అందులో భాగంగా గోదావరిఖని లోని శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి జెండావిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ..ఈనెల 10 వ తేదీన ఏన్టీపీసీ గేటు నెంబర్ 2 నుండి టి.వి.గార్డెన్ వరకు ర్యాలీ చేసి అనంతరం టి.వి.గార్డెన్ లో బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగే ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథులుగా జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయి బాబు, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్,బి.మధు, హాజరౌతున్నారని అన్నారు.ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను, ఉద్యమాన్ని సమీక్ష చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.

Also Read : సర్పంచి కి అక్రిడేషన్ కార్డు

ర్యాలీ,బహిరంగ సభకు సంఘటిత,అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెర్వట్ల నర్సయ్య, నాయకులు రంగయ్య,రాము,ఎం.మల్లేశ్,పి.శ్రీనివాస్,బి.రవి,ఆర్.శ్రీనివాస్, కె.మల్లేశ్,బి.సారయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube