మన బడి పనులు వేగవంతం చేయాలి

మన బడి పనులు వేగవంతం చేయాలి

0
TMedia (Telugu News) :

మన బడి పనులు వేగవంతం చేయాలి

టీ మీడియా, జూన్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ మనిగిల్ల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు మనబడి పనులను మంగళవారం పరిశీలించారు. పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు కచ్చితంగా పనులలో నాణ్యత పరిశీలించాలన్నారు.ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చుటకు గ్రామ పెద్దలు ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను ఉన్నత పాఠశాలలో వినియోగించుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు.

Also Read : విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

పాఠశాల వసతులు ఏర్పాటు విషయంలో మిగతా పాఠశాలల్లో కూడా దాతలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మరియు ఉపాధ్యాయులు విష్ణువర్ధన్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube