నీట్ విద్యార్థికి సన్మానం

నీట్ విద్యార్థికి సన్మానం

0
TMedia (Telugu News) :

నీట్ విద్యార్థికి సన్మానం

టీ మీడియా, సెప్టెంబర్14, వనపర్తి బ్యూరో : పేదలకు సరైన రీతులో వైద్యసాయం అందించినప్పుడే దేశం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధిస్తుందని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. వనపర్తి పట్టణానికి చెందిన బండారు శ్రీవల్లి నీట్ పరీక్షలో 527 ర్యాంక్ ను సాధించిన సందర్భంగా బుధవారం సాహితీ కళావేదిక సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన భరతవాన్ని నిర్మించుకోవడంలో వైద్యులది ప్రముఖమైన పాత్ర అని వైద్యవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పేదలకు వైద్యసాయం అందించాలని పేర్కొన్నారు.

Also Read : విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

శ్రీవల్లి తల్లిదండ్రులు బండారి శ్రీనివాసులు, విద్యావతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. తమ కూతురు చక్కటి ర్యాంకును సాధించడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కవి జనజ్వాల, ఓంకార్, పోచ రవీందర్ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, నిరంజనయ్యా,రాజారాం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube