నిత్యం నెగిటివ్‌ ఆలోచనలు వేధిస్తున్నాయా

నిత్యం నెగిటివ్‌ ఆలోచనలు వేధిస్తున్నాయా

0
TMedia (Telugu News) :

నిత్యం నెగిటివ్‌ ఆలోచనలు వేధిస్తున్నాయా.?

లహరి, అక్టోబర్ 14, ఆధ్యాత్మికం : భారత దేశంలో వాస్తును విశ్వసించే వారు చాలా మంది ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు అనేది కేవలం ఇంట్లో ఉండే వారి శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ఇంట్లో వాస్తు సరిగ్గా లేకపోతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక కొందరు ఎంత సంపాదన ఉన్నా, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా నిత్యం నెగిటివ్‌ ఆలోచనలు వెంటాడుతుంటాయి. ఇంతకీ ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఎలాంటి వాస్తు నియమానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

– మనలో చాలా మంది పనికి రాని వస్తువులను కూడా ఇంట్లోనే పెట్టుకుంటాం. విరిపోయినవి, పగిలిపోయినవి కూడా బయటపడేయకుండా అలాగే వాడుకుంటారు. లేదా ఓ మూలన పెట్టేస్తారు. అయితే ఇలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. విరిగిపోయిన వస్తువులను వెంటనే బయటపడేయాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read : స్మార్ట్ కిడ్జ్ లో హోరెత్తిన బతుకమ్మ సంబురం.

– ఈ మధ్యకాలంలో బెడ్‌ రూమ్స్‌లో అద్దాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వాస్తు ప్రకారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌ రూమ్‌లో అద్దాలు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. బెడ్‌రూమ్‌లో అద్దాలు ఉంటే ఇంట్లో నిత్యం గొడవలు, వాదనలు జరుగుతాయని చెబుతున్నారు. నిద్రలేమి సమస్య వెంటాడంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
– ఇక మనలో చాలా మంది వంట గదిలో ట్యాబ్లెట్స్‌ను పెట్టుకుంటున్నారు. కిచెన్‌లో ఎట్టి పరిస్థితుల్లో మందులను ఉంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కిచెన్‌లో మందులను ఉంచడం వల్ల సైకలాజికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇవి పాటించండి :
– ఇంట్లో నెగిటివ్‌ ఆలోచనలు పెరిగినా, నిత్యం ఏదో ఒకట గొడవ జరుగుతోన్నా.. అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో చేపలను పెంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
– ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే కచ్చితంగా తులసి మొక్కను పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తూర్పు దిశలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకొని ప్రతీ రోజూ నమస్కరించడం ద్వారా ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు.

Also Read : కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

– ఇక ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీని తరిమికొట్టాలంటే ఇంటి గుమ్మానికి ముందు గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఖాళీగా ఉండే గోడ వల్ల ఇంట్లో వారు ఒంటరితనంతో బాధపడుతుంటారని చెబుతున్నారు. విగ్రహం లేకపోతే కనీసం ఫొటో అయినా పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube