లీకేజీల,పారిశుద్ద పనులలో పాలకుల అధికారుల నిర్లక్ష్యం

లీకేజీల,పారిశుద్ద పనులలో పాలకుల అధికారుల నిర్లక్ష్య

1
TMedia (Telugu News) :

లీకేజీల,పారిశుద్ద పనులలో పాలకుల అధికారుల నిర్లక్ష్యం

టీ మీడియా, మే 28, వనపర్తి బ్యూరో : నందిమల్ల శారదా మాజీ కౌన్సిలర్ పట్టణములో సమస్యలు పరిష్కరించడంలో మున్సిపల్ పాలక వర్గం విఫలమైందని నందిమల్ల శారదా ఆరోపించారు. ఎక్కడ చూసినా మిషన్ భగీరథ పేరిట రోడ్లు ధ్వసం అయినా పాలకవర్గం,మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదు.దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోడ్ల విస్తరణ పనులు ఆఘమేఘాల మీద ప్రారంభించిన నాయకులు నష్ట పరిహారం విషయములో ఎటు తేల్చుకోలేకపోవడం వల్ల అసంపూర్తిగా ఉండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దుమ్ము,దూళి వల్ల అనారోగ్యపాలుఅవుతున్నారు.ప్రచారం కోసం ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమిలేదని అన్నారు. 22వార్డ్ నా హాయములో చేసిన ఇంటింటికి పింఛన్లు,పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, సి.సి రోడ్లు తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా జరగకపోవడం శోచనీయం.ఎటువంటి నిధులు అవసరం లేని పారిశ్యుద్ద పనులు మూలన పడ్డాయి.అంతర్గతంగా రోడ్లను శుభ్రపరచడం లేదు.డ్రైనేజీలు నిండి రోడ్ల మీద ప్రవహిస్తున్న పట్టించుకోవడములేదు.

 

Also Read : 4 నుంచి డా.బీఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పీజీ పరీక్షలు

గణేష్ నగర్ నందు మంచి నీటి పైపు పగిలిపోయి రెండు నెలలు అవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.తాళ్ల చెరువు మరమ్మత్తు అవసరానికి మించి నాయకుల స్వార్థం కోసం కోట్లు కేటాయించే బదులు వార్డులో ఉన్న మౌలిక వసతుల కోసం కేటాయించాలని డిమాండు చేస్తున్నాను.
ఇప్పటికయినా వార్డులో దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికి పింఛన్లు మంజూరు చేయాలని, వార్డులో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.లేనిపక్షంలో ప్రజలతో కలిసి మునిసిపాలిటీని ముట్టడిస్తాని హెచ్చరిస్తున్నాను.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube