టీ మీడియా డిసెంబర్ 16: కొణిజర్ల
తనికెళ్ళ గ్రామం లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ జిల్లా సారీరాక్ ప్రముఖ్ అజ్మీరా నాగేశ్వరావు ,సిఐఎస్ఎఫ్ జవాన్ పెరిక శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజ్మీరా నాగేశ్వరావు మాట్లాడుతూ విజయ్ దివస్ యొక్క గొప్పతనాన్ని వివరించారు తరువాత జవాన్ లకు నివాళులు అర్పించి తనికెళ్ల లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నెహ్రూ యువ కేంద్రం మండల వాలంటీర్స్ అన్నారపు అశోక్, బానొత్ గాంధీ, సిఐఎస్ఎఫ్ జవాన్ పెరిక శ్రీనివాస్,శంకర్, ప్రశాంత్ ,వీరభద్రమ్ తదితరులు పాల్గొన్నారు.