నాగాలాండ్‌, మేఘాలయ సిఎంలుగా నెయిఫియు, కొన్రాడ్‌ల ప్రమాణస్వీకారం

నాగాలాండ్‌, మేఘాలయ సిఎంలుగా నెయిఫియు, కొన్రాడ్‌ల ప్రమాణస్వీకారం

0
TMedia (Telugu News) :

నాగాలాండ్‌, మేఘాలయ సిఎంలుగా నెయిఫియు, కొన్రాడ్‌ల ప్రమాణస్వీకారం

టీ మీడియా, మార్చ్ 7,కొహిమా / షిల్లాంగ్‌ / అగర్తల : ఎన్‌డిపిపికి చెందిన నెయిఫియు రియో, ఎన్‌పిపికి చెందిన కొన్రాడ్‌ సంగ్మాలు నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాషాయ పార్టీకి చెందిన మాణిక్‌ షా హోలీ మరుసటి రోజు గురువారం త్రిపుర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు హాజరుకానున్నట్లు సమాచారం. నాగాలాండ్‌లో మొట్టమొదటిసారిగా ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అసెంబ్లీకి ఎన్నికైన అన్ని పార్టీలు కూడా ఎన్‌పిపి-బిజెపి కూటమికి మద్దతు ప్రకటించడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా పోయింది. మేఘాలయలో బిజెపికి చెందిన ఇద్దరితో సహా మొత్తం 45 మంది ఎమ్మెల్యేలతో కొన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.

Also Read : తల్లిదండ్రుల శ్రాద్ధం? ఇంట్లోనే నిర్వహించాలా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube