ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

టీ మీడియా, జనవరి 23, మధిర : భారత స్వాతంత్ర సంగ్రామ పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి వేడుకలను సోమవారం మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతావని స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన యోధులను స్మరించుకుంటూ పరాక్రమ దివస్ గా దేశవ్యాప్తంగా సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటున్న సందర్భంలో సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించుకొనటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ కే. లావణ్య, శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, కుమారి, రామకృష్ణ, రోజామణి, లక్ష్మి ,గోపాల్, జీవన్ తదితరులు పాల్గొని నేతాజీకి ఘనమైన నివాళులర్పించారు.

Also Read : దీవులకు పరమ్‌వీర్‌ చక్ర గ్రహీతల పేర్లు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube