సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో కొత్తకోణం

సుపారీ గ్యాంగ్‌ హత మార్చింది

1
TMedia (Telugu News) :

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో కొత్తకోణం
-సుపారీ గ్యాంగ్‌ హత మార్చింది

టి మీడియా,జులై5,హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ హత్యను పరువు హత్యగా తేల్చారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న నారాయణరెడ్డిని మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఢిల్లీలో ఉన్న కుమార్తె, అల్లుడిని ఘనంగా పెళ్లి చేస్తానంటూ ఇంటికి పిలిపించి కుమార్తెను గృహనిర్భందం చేశారు. ఈ క్రమంలో వేరే పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేయడంతో అందుకు ఆమె నిరాకరించింది.దీంతో తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న నారాయణ రెడ్డిని హత్య చేయాలని యువతి తండ్రి భావించాడు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలకు వెంకటేశ్వరరెడ్డి ఐదు లక్షల సుపారీ ఇచ్చాడు.

 

Also Read : మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం

జూన్‌ 27న కేపీహెచ్‌బీ రూమ్‌ నుంచి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని మద్యంలో మత్తు మందు కలిపి టవల్‌తో మెడకు ఉచ్చుగా వేసి సుపారీ గ్యాంగ్‌ హత మార్చింది.అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి తండ్రి వెంకటేశ్వరరెడ్డిని గిద్దలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు, నిందితులు ప్రకాశం జిల్లా పొదలకుంట్లపల్లికి చెందిన వారుగా గుర్తించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube