నూతన కలెక్టరేట్ నిర్మాణం పరిశీలించిన విఎస్డీ

నూతన కలెక్టరేట్ నిర్మాణం పరిశీలించిన విఎస్డీ

1
TMedia (Telugu News) :

నూతన కలెక్టరేట్ నిర్మాణం పరిశీలించిన విఎస్డీ

టి మీడియా,ఏప్రిల్21,ఖమ్మం:

ఖమ్మం నూతన కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయపు ఓ.ఎస్.డి. ప్రియాంక వర్గీస్ బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాల సేవలు ఒకేచోట ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తీసుకున్న నిర్ణయం. మేరకు రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయ పనుల పురోగతిని, జిల్లా కలెక్టర్ కార్యాయంతో పాటు వివిధ ఉన్నతాధికారులు, శాఖల కార్యాలయాల ఏర్పాటు పనులను ఓ.ఎస్.డికు జిల్లా కలెక్టర్ వివరించారు.అనంతరం రఘునాధపాలెం బృహత్పల్లె ప్రకృతి వనాన్ని ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ సందర్శించారు. 14 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనంలో ఇప్పటివరకు 20 వేలకు పైగా మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టరు వివరించారు. డ్రిప్ పద్ధతిన నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని వేసవి దృష్ట్యా ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు.

Also Read : స్కాలర్ సిప్స్, రియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి

పచ్చదనం పెంచడం ద్వారా పర్యావరణ సంరక్షణతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన కాలుష్యరహిత వాతావరణం లభిస్తుందని, పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలలో విరివిగా మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని ఓ.ఎస్.డి అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఓ.ఎస్.డి ప్రియాంక వర్గీస్ బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల ఆమో సంతృప్తి వ్యక్తంచేసి అభినందించారు.అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్, సురభి, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, ఆర్. అంద్.బి ఎస్. లక్ష్మణ్, ఇ.ఇ శ్యాంప్రసాద్, రఘునాధపాలెం మండలం తహశీల్దారు నర్సింహారావు, ఎం.పి.డి.ఓ రామకృష్ణ, ఎం.పి.పి. భూక్యా గౌరీ, సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube