న్యూ డేమాక్రసి ఆధ్వర్యంలో ధర్నా

టిమీడియా, మార్చి 8

0
TMedia (Telugu News) :

టిమీడియా, మార్చి 8 ,జూలూరుపాడు:
పోడు రైతులకు పట్టా హక్కు కల్పించాలంటూ జూలూరుపాడు మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జూలూరుపాడు కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం FRO గారికి వినతిపత్రం అందజేసారు.పోడు రైతుల దర్నా నుద్దేసంచి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్సి ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ: టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటుతు పోడు భూములను బలవంతంగా లాక్కొంటుందని ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులతో టిఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేపిస్తుందని వెంటనే ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని,
పోడు రైతుల దగ్గర నుండి భూములు లాక్కుని ఖనిజ సంపద కార్పొరేట్ కంపెనీలకు అప్ప చెప్పేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఎన్నికల ముందు పోడు రైతులకు పట్టా హక్కులు కల్పిస్తామని వాగ్దానం చేసి ఈరోజు ముఖ్యమంత్రి ఫారెస్ట్ అధికారులతో రైతులపై దాడులు చేపించడం దారుణం అని అన్నారు.గోపాలరావు మాట్లాడుతూ 2014 జూన్ 2 వ తేదీని కటాఫ్ తేదిగా నిర్ణయించి ప్రతిఒక్క గిరిజన, ఆదివాసీ, పేద పోడు రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులపై అటవీశాఖ వారు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం గతంలో దరఖాస్తు చేసుకొని తిరస్కరణ కు గురైన దరఖాస్తుదారులoదరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనేక గ్రామాల్లో అధికార బలం ఉన్న వారితో పోడుభూమి కమిటీలు ఏకపక్షంగా వేశారని ఇలాంటి చోట్ల పక్షపాత వైఖరితో కొంతమందికి పోడు సాగు దారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని పోడు సాగు దారులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఆందోళనలు తప్పవని అన్నారు పోడు సాగు దారులు అందరికీ న్యాయం జరిగే విధంగా అవినీతికి తావు లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు అడవి మధ్యలో పోడువ్యవసాయo ఉండడానికి వీల్లేదని ప్రభుత్వ వాదనలో హేతుబద్ధత లేదని విమర్శించారు పోడు వ్యవసాయం అడవిలో కాక ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు వలస ఆదివాసీలకు హక్కు లేదనడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని అన్నారు రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు సమాన హక్కులు వర్తిస్తాయని అన్నారు .మూడు దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న పోడు రైతులందరికీ పట్టాలు ఇప్పిస్తామని రైతుల దగ్గర లంచాలు దండుకోనే మధ్య దళారీల ప్రమేయం అరికట్టాలని,దళారీల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోడు సాగుదారులకు ప్రభుత్వం రైతు బందు మొదలగు పథకాలను అందజేయాలని గోపాలరావు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లోమండల ఉపాద్యాచ్చులు గలిగ వెంకటేశ్వర్లు నాయకులు మడి సీతరాములు,బచ్చల నాగేశ్వరరావు,మడి నాగేంద్రబాబు,బోర్రా బిచ్చం,గోగ్గల భద్రమ్మ,బచ్చల ఈశ్వర్,గలిగ స్వరూప, నర్సమ్మ,వెంకట రమణ,పర్సిక సుజాత,ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

POLICE

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube