మహేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మహేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

1
TMedia (Telugu News) :

మహేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

టీ మీడియా ,మే 10 ,జన్నారం:

జన్నారం మండలం మహేంద్ర సంఘం నూతన కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో మంగళవారం రోజున మహేంద్ర సంఘ భవనంలో అధ్యక్షులు మామిడిపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జన్నారం మండల మహేంద్ర సంఘం గౌరవ అధ్యక్షులుగా సూరనేని కొండయ్య, అధ్యక్షులుగా ఎం ఆర్ నర్సింగరావు, ఉపాధ్యక్షులుగా చిలువేరు నర్సయ్య, పిల్లి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా కోడిజుట్టు రాజన్న, కార్యదర్శులుగా పర్ల కనకయ్య, సంధ గోపాల్, ఓడి పెళ్లి పెద్ద మల్లేష్, కోశాధికారిగా పిల్లి మల్లయ్య, ప్రచార కార్యదర్శి గా ఓడి పల్లి రామయ్య, సంయుక్త కార్యదర్శులుగా వేముల నర్సయ్య, పిళ్లి అంజయ్య, నగురు మహేందర్, న్యాయసలహాదారులుగా నగురు రవీందర్, సలహాదారులుగా కనికరపు అశోక్, డైరెక్టర్లుగా ఒడిపెళ్లి అంజయ్య, సూర నేని సత్తయ్య, చింత ఎల్లయ్య, నీలా మధు లను ఎన్నుకున్నారు.

Also Read : నిందితుడి అకౌంట్ నుంచి రూ.5 లక్షలు కొట్టేసిన పోలీస్ బాస్

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎం ఆర్ నర్సింగరావు మాట్లాడుతూ  మాపై ఉన్న నమ్మకంతో మరలా మాకే పట్టం కట్టడంతో మేము మరలా సంఘానికి సేవ చేసే భాగ్యం దక్కిందని మేదారులకు ఉన్న సమస్యల పై ఎల్లవేళలా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సంఘ అభివృద్ధికి అహర్నిశలు కష్టించి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జన్నారం మండలం మహేంద్ర సంఘం నాయకులు మరియు మహేంద్ర యువజన సంఘం సభ్యులు తదితరులు  పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube