న్యూ ఇండియా పార్టీ నూతన కమిటీ ఎన్నిక

న్యూ ఇండియా పార్టీ నూతన కమిటీ ఎన్నిక

1
TMedia (Telugu News) :

న్యూ ఇండియా పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టీ మీడియా,సెప్టెంబర్ 20,పెద్దపల్లి :

న్యూ ఇండియా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి గా, మరియు సోషల్ మీడియా అధికార ప్రతినిధి గా నగునూరి విజయ్ కుమార్ ను మంగళవారం నియమించారు.ఈమేరకు ఆయన నియామకాన్ని న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు డి.ఆర్.జే వి రాజు ప్రకటించారు.

Also Read : కార్మికుల పక్షపాతి పువ్వాడ అజయ్

న్యూ ఇండియా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, ప్రజా ఉద్యమాలను మరింత ఉదృతం చేయాలి అనే ఉద్దేశం తో మరియు న్యూ ఇండియా పార్టీ ఉపాధ్యక్షులు వేముల అశోక్ గారి సూచన మేరకు నియమించామని తెలిపారు.నూతనంగా ఎన్నికైన నగునూరి విజయ్ కుమార్ స్థానిక సమస్య ల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తు పార్టికి గుర్తింపు తేవాలని కోరారు.

Also Read : రోజుకో వెల్లుల్లి రెబ్బ,అల్లం ముక్క తో రోగనిరోధక శక్తి

కాగా తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు,జనగామ తిరుపతి,మహబూబ్ ఆలి, రామగిరి విక్రమ్ సింగ్,మాదరబాయిన నర్సయ్య,బి.గోపాల్,గంట బబిత సోని,ఆషాడం మేఖేశ్,వానమామలై రామాచారి లకు ఈ సందర్బంగా నగునూరి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube