మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు

రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ 

1
TMedia (Telugu News) :

మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు

– రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్

టీ మీడియా,సెప్టెంబర్15,మంచిర్యాల:  మహిళల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు రూపొందించిందని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ అన్నారు.గురువారం మంచిర్యాల జోన్ సిసిసి నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో మహిళల భద్రతకోసం ” షీ అవగాహన” కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథి గా ఆయన పాల్గొనగా, మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని, బాలికల మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని తెలిపారు. మహిళలు బాలికలు కష్టపడి చదివి ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని చదవాలని సూచించారు. సమాజంలో మగవారితో పోటీపడి ఉద్యోగాలు సాధిస్తున్నారని అన్నారు. జ్ఞానాన్ని పెంచుకొనే విధానంగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని అన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టేందుకు, క్షేత్రస్థాయిలో తక్షణమే సమస్య ఉన్న చోటుకు చేరుకొనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఆదేశాల మేరకు 2014 అక్టోబర్ 24 న షీ టీమ్స్ ప్రారంభించినట్లు తెలియజేశారు.పిల్లల, విద్యార్థిని ల మహిళల రక్షణకై 24 గంటలు నిరంతరం షీ టీం సిబ్బంది మఫ్టీల్లో ప్రధాన కూడలల్లో, స్కూల్స్, బస్టాండ్, కళాశాలల వద్ద, రద్దీ ప్రదేశాలలో సామాన్య జనాల్లో ఉంటూ మహిళలకు విద్యార్థులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలియజేశారు.

 

Also Read : సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపెల్లి జిల్లాకు సంబంధించిన రామగుండం పోలీస్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ లో, మంచిర్యాల జోన్ కి సంబంధించి మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో షీ టీమ్స్ ప్రత్యేక ఆఫీస్ లను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఏ సమయంలోనైనా ఆపదలో ఉన్న మహిళలువిద్యార్థి నిలు షీ టీమ్స్ ను సంప్రదించా లని అన్నారు.ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్నారులపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని , అలాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. సంఘటనలు జరిగిన తర్వాత బాదపడకుండా, ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలని అన్నారు. సోషల్ మీడియా మాధ్యమాల లో గుర్తు తెలియని వారితో ఎలాంటి చాటింగ్ చేయరాదని, మెసెజు లకు ఎలాంటి స్పందన చేయరాదని అన్నారు. సాధ్యమైనంత వరకు ప్రతీ ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులతో లేదా పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించాలని అన్నారు. ఆన్లైన్ వేధింపులు , బ్లాక్ మెయిల్ చేయడం లాంటి సంఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టి అడ్డుకట్ట వేసేదిశగా చర్యలు తీసుకుంటున్నామనిఅన్నారు. తమకు తాము స్వయంగా ఎదుర్కోనే సమస్యల పట్ల , ఇతర పిల్లలకు ఎదురయ్యే ఆన్లైన్ వేధింపులు , సైబర్ నేరాల పట్ల గోప్యత పాటించడం ఈ షీ టీమ్స్ గురించి, సైబర్ నేరాల గురించి, ఈవ్ టీజింగ్ గురించి క్లుప్తంగా విధ్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం షీ టీమ్స్ పాత్ర…
బహిరంగ ప్రదేశాల్లో యువతులు, మహిళలపై వేధింపులను అరికట్టడంలో భాగంగా ఏర్పాటు చేసిన ” షీ టీమ్ ” కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వ్యక్తుల ఆలోచనల్లో మార్పులు వచ్చేలా వినూత్న కార్యక్ర మాలు నిర్వహిస్తూ వస్తున్నాయని అన్నారు. తొలిసారి నేరం చేస్తూ పట్టుబడిన వారికి ప్రొఫెషనల్ కౌన్సిర్లతో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారి ని నిర్ధిష్టకాలం పర్యవేక్షించడం జరుగుతోందని అన్నారు. మహిళల భద్ర తలో భాగంగా ఏర్పాటు చేసిన హ్యాక్ ఐ యాప్ ద్వారా ఎస్.ఓ.ఎస్ బటన్ విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ లాంటి ఫీచర్లతో షీ టీమ్ సాంకేతిక పరంగా కూడా ముందంజలో ఉందని అన్నారు.రామగుండం కమీషనరేటు పరిధిలో 124 పిటీషన్లు వచ్చినట్లు తెలిపారు. షీ టీమ్ ల ద్వారా 20 ఎఫ్.ఐ.ఆర్లు , 20 పిట్టీ కేసులు కాగా 62 మందికి కౌన్సిలింగ్ లు నిర్వహించినట్లు తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ ల పరిధిలలో షీ టీమ్ ద్వారా 1674 అవగాహాన కార్యక్రమాలు, హాట్ స్పాట్స్ విజిట్ 1502, డెకయ్ ఆపరేషన్ 903 లు నిర్వహించామని అన్నారు.వేధింపులకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 5 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఆయా సేవలకు గాను రాష్ట్రంలో రామగుండం కమిషనరేట్ కి మంచి గుర్తింపు లభించిందని అన్నారు. రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ప్రకటించగా రాష్ట్రస్థాయిలో 02వ స్థానం నిలిచినట్లు తెలిపారు.

Also Read : మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తల్లిదండ్రులకు రామగుండం పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి :

చిన్నపిల్లని తెలిసిన వ్యక్తులైన తెలియని వ్యక్తులతో నమ్మి పంపరాదని అన్నారు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల పై లైంగిక దాడులు జరుగుతున్నాయని , అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేధింపులు, ఈవ్ టీజింగ్ కు గురయ్యే మహిళలు యువతులు, విద్యార్ధినిలు నిర్భయంగా రామగుండం ” షీ టీమ్స్ “ను ఆశ్రయించాలని లేదా డయల్ 100 , చేయాలని అన్నారు.రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్
షీ టీమ్ వాట్సప్ నెంబర్ 6303923700 , పెద్ద పల్లి షీ టీమ్ ఇంచార్జీ 9866136140
ఫోన్ నంబర్ల లో సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి తిరుపతి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్,ఎస్ఐ లు, విధ్యార్ధినిలు, కాలేజీ లెక్చరర్లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube