కనకదుర్గమ్మ ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పాటు
కనకదుర్గమ్మ ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పాటు
కనకదుర్గమ్మ ఆలయానికి నూతన పాలకమండలి ఏర్పాటు
లహరి, ఫిబ్రవరి 7, విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో కూడిన నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది. ఈ పాలకమండలిలో కర్నాటి రాంబాబు, కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, కొలుకులూరి రామసీత, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, వేదకుమారిని పాలక మండలి సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ 15 మంది సభ్యులు కలిసి పాలకమండలి ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.