నూతన మండలంగా ‘ఇనుగుర్తి’
– సీఎం కేసీఆర్ ఆదేశాలు
– ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తికి స్పందన
– దీర్ఘకాలిక కోరిక సాకారం
టి మీడియా, జూలై26,హైదరాబాద్:
మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇనుగుర్తి మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజల ఆకాంక్ష కొనసాగుతున్నది.
Also Read : ముంపు ప్రాంతం నిర్వాసితులకు నిత్యవసరలుఅందజేయాలి
ఈ నేపథ్యంలో ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయడానికి ఉన్న అర్హతలు.. చారిత్రక నేపథ్యాన్ని.. ఆ గ్రామానికి చెందిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను కలిసి విజ్జప్తి చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యేలను సోమవారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని, చర్చించారు. అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ముఖ్యమంత్రి ఇనుగుర్తి ని మండలంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.