కొత్త పార్టీ పెడతా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

కొత్త పార్టీ పెడతా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

0
TMedia (Telugu News) :

కొత్త పార్టీ పెడతా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

టీ మీడియా, నవంబర్ 29, విశాఖపట్నం : ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందే అని అన్నారు. నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని చెప్పారు. కొంచె వెనుకబడే అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Also Read : అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్సే గెలువాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube