AK61 పోస్టర్‌ రిలీజ్‌.. మాస్‌ లుక్‌లో అదరగొడుతున్న అజిత్‌

AK61 పోస్టర్‌ రిలీజ్‌.. మాస్‌ లుక్‌లో అదరగొడుతున్న అజిత్‌

2
TMedia (Telugu News) :

AK61 పోస్టర్‌ రిలీజ్‌.. మాస్‌ లుక్‌లో అదరగొడుతున్న అజిత్‌

టీ మీడియా, సెప్టెంబర్ 22, సినిమా : త‌మిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సుప‌రిచిత‌మే. ఫలితం ఎలా ఉన్నా ఈయన వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తుంటాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఒకటి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరపుకుంటుంది. కాగా మేకర్స్ ఇప్పటినుండే అజిత్‌ పోస్టర్‌లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నారు.

Also Read : రాయపూడి బడా మోసం

లేటెస్ట్‌గా విడుదలై ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు.సెకండ్‌లుక్‌లో నెరిసిన జుట్టు, గడ్డంతో.. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మాస్‌లుక్‌లో ప్రేక్షకులకు దర్శనం ఇచ్చాడు. ఈ చిత్రం అవుట్‌ అండ్ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ ఫిలింగా తెరకెక్కనుంది. ఈ మూవీకి తునివు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. జీ-స్టూడీయోస్‌, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్‌ అడ్వేంచర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నాడు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube