నూతన హంగులు, అద్భుతమైన దృశ్యం

తెలంగాణలో కొత్త సచివాలయం

1
TMedia (Telugu News) :

నూతన హంగులు, అద్భుతమైన దృశ్యం

– తెలంగాణలో కొత్త సచివాలయం

టి మీడియా,నవంబర్ 17,హైద్రాబాద్ బ్యూరో : నెక్లెస్ రోడ్డు నుంచి చూస్తే గుట్ట పైన ఉన్న బిర్లా మందిర్ నూతన సచివాలయం పైన ఉన్నట్టు కనిపిస్తుంది తెలంగాణలో కొత్త సచివాలయ సముదాయానికి సంబంధించిన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. అయితే ఫార్ములా-ఇ రేసుకు ముందు, వచ్చే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 11 మధ్య ఉంటుందని తెలుస్తోంది.తెలంగాణలో కొత్త సచివాలయం సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫార్ములా-ఇ రేస్‌ జరగనుంది. అయితే రహదారికి అవతలి వైపున ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారకంతో పాటు కాంప్లెక్స్‌ను ప్రారంభించాలని ముఖ్యమంత్ర కేసీఆర్ ప్రతిపాదనలు వెళ్లాయి.

Also Read : మహిళా లెక్చరర్‌పై భర్త హత్యాయత్నం

ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారు.సచివాలయ సముదాయంలో రెండు భారీ గోపురాలను ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి మంగళవారం ఏర్పాటు చేశారు. గోపురం పైన ఉన్న జాతీయ చిహ్నంతో భవనం 278 అడుగుల ఎత్తుకు వెళుతుంది. లుంబినీ పార్కుపక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం కూడా తుదిదశకు చేరుకుంది. సుమారు 90 శాతం వరకు పనులు జరిగినట్టుగా తెలుస్తోంధి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube