చిరు వ్యాపారులకు మహర్దశ..!
టీ మీడియా, మార్చి07, మధిర:
మున్సిపాలిటీ లోనీ మెయిన్ రోడ్,ఆర్ వి కాంప్లెక్స్, ఆర్ ఓ బి కింద ఉన్న చిరు వ్యాపారులకు నూతన దుకాణాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమాదేవి చైర్పర్సన్ మొండితోక లత జయకర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ దళారీ వ్యవస్థ నుండి చిరు వ్యాపారులకు న్యాయం చేసే దిశగా జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశాల మేరకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సూచనల మేరకు చిరు వ్యాపారులు అందరికీ న్యాయం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వారు తెలిపారు.
also read:తెలంగాణ బడ్జెట్ 2022-23
ఇందులో రాజకీయాలకు తావులేదని మున్సిపాలిటీలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యల్లో భాగంగానే ప్రభుత్వ స్థలంలో చిరు వ్యాపారులకు నూతన దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని వారు తెలిపారు. ముందు షాప్ లు నిర్మించి ఇచ్చిన తర్వాతే ప్రధాన రహదారి వెంట ఉన్న షాపులను తీసివేయడం జరుగుతుందని చిరు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి తెలిపారు.
also read:*టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి*
మున్సిపాలిటీ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా అందరూ సహకరించాలని ప్రజల సహకారంతోనే మంచి పనులు చేసేందుకు అవకాశం ఉంటుందని వారి సందర్భంగా పేర్కొన్నారు. గతంలో 20 సంవత్సరాల క్రితం ఎవరు ఆక్రమించుకొని షాపులను ఐదు వేల నుండి పదివేల వరకు అద్దెకు ఇస్తున్నారని దళారీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.చిరు వ్యాపారులకు సూచించారు. వాస్తవంగా ఎవరైతే చిరు వ్యాపారం చేసుకొని బ్రతుకుతున్నారు వారికి న్యాయం జరిగేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని పాలకమండలి సభ్యులు సమ ఆలోచనతోనే నిర్ణయం జరుగుతుందని వారు తెలిపారు.
