కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు.. ఆందోళన వద్దు

కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు.. ఆందోళన వద్దు

0
TMedia (Telugu News) :

కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ప్రమాదకరం కాదు.. ఆందోళన వద్దు

– ఢిల్లీ ఆరోగ్య మంత్రి

టీ మీడియా, డిసెంబర్ 26, న్యూఢిల్లీ: కరోనా న్యూ స్ట్రెయిన్‌ (జె ఎన్.1) వేగంగా విస్తరిస్తుండటంపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ స్పందించారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొవిడ్ స్ట్రెయిన్‌ అంత ప్రమాదకరం ఏమీ కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా బాధితుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ‘దేశంలో విస్తరిస్తున్న కొవిడ్‌ న్యూ స్ట్రెయిన్‌ ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌కు సబ్‌ వేరియంట్‌. ఇది రెండు రూపాల్లో ఉంది. ఈ రెండు రూపాలు కూడా ప్రమాదకరం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప భయాందోళనలు సృష్టించకూడదు. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహిస్తున్నాం’ అని ఢిల్లీ ఆరోగ్య మంత్రి చెప్పారు.

Also Read : గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి దేశానికి అందిస్తాం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube