నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 30, మహానంది:

మహానంది మండలంలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా ఎవరి ఇంట్లో వారు నిర్వహించుకోవాలని మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి అన్నారు. ఓమి క్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించిందని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం మహానంది పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకల సంధర్బంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి హోటళ్లలో ,సామూహిక పార్టీలకు అనుమతులు లేవన్నారు.ప్రజలు, యువత పోలీసులకుసహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలిపారు. ఓమి క్రాన్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కోవిడ్ ఆంక్షలు తప్పనిసరి అవుతున్నాయి. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సహకరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు నిర్వహించి నూతన సంవత్సర సంబరాలు చేసుకోవడానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం నుంచి మహానంది మండలంలోని పలు గ్రామాల్లో గస్తీలు చేపడతారన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటారన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube