వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

0
TMedia (Telugu News) :

వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

– మంత్రి గంగుల కమలాకర్

టీ మీడియా, అక్టోబర్ 25, కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్రం రాకముందు అభివృద్ధి శూన్యం. కరెంటు, నీళ్లు లేక రైతులు ఆగమయ్యారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం ఆనవాయితీ ప్రకారం మంత్రి బొమ్మకల్ నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు కరెంటు ఎప్పుడు వస్తదని రైతుల ఎదురు చూసేవారు. కరువు కాటకాలతో రైతులంతా దుబాకియి కివలసలు వెళ్లారు. మానేరు డ్యాం తలాపున ఉన్నా తాగటానికి చుక్క నీరు ఉండకపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక అభివృద్ధిలో కరీంనగర్ దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.సమైక్య పాలనలో తెలంగాణ సంపదను ఆంధ్రులు దోచుకెళ్లారు. అభివృద్ధి చెందిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. కరీంనగర్‌లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

Also Read : దేవ్‌భూమిలో ముకేశ్‌ అంబానీ ప్రత్యేక పూజలు

రానున్న ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాలన్నారు. ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి పట్టం కట్టాలి. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube