ముంబైలో దావూద్‌ సహచరులపై ఎన్‌ఐఏ దాడులు

ముంబైలో దావూద్‌ సహచరులపై ఎన్‌ఐఏ దాడులు

1
TMedia (Telugu News) :

ముంబైలో దావూద్‌ సహచరులపై ఎన్‌ఐఏ దాడులు

టి మీడియా, మే9,ముంబై: అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్‌ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న వారు, షార్ప్‌ షూటర్లు, డ్రగ్‌ ట్రాఫికర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇండ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడిచేశారు. ముంబైలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్‌, పాలెల్‌, శాంతాక్రజ్‌ సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

Also Read : రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థులకు గాయాలు

దావూద్‌కు చెందిన డీ కంపెనీలోని అగ్రనాయకత్వం అండతోనే దేశంలో జరుగుతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో దావూద్‌కు చెందిన స్థావరాలు, అనుచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది.1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నింధితులైన అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube