గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ దాడులు

గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ దాడులు

2
TMedia (Telugu News) :

గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ దాడులు

టీ మీడియా,సెప్టెంబర్ 12, చండీఘ‌డ్‌: ఉగ్ర‌వాద గ్రూపుల‌తో లింకు ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. పంజాబ్‌, హ‌ర్యానా, ఢిల్లీ లో ఈ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. యూఏపీఏ కింద ఢిల్లీ పోలీసులు న‌మోదు చేసిన కేసులో ఈ సోదాలు జ‌రుగుతున్న‌ట్లు పంజాబ్ డీజీపీ గౌర‌వ్ యాద‌వ్ తెలిపారు. ఈ దాడుల‌కు, సిద్దూ మూసేవాలా హ‌త్య‌కు లింకు లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎన్ఐఏ చేస్తున్న ద‌ర్యాప్తున‌కు పంజాబ్ పోలీసులు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు డీజీపీ వెల్ల‌డించారు. యాంటీ గ్యాంగ్‌స్ట‌ర్ టాస్క్ ఫోర్స్ చీఫ్ ఏడీజీపీ ప్ర‌మోద్ బాన్ నాయ‌క‌త్వంలో పంజాబ్ పోలీసు బృందాలు దాడులు నిర్వ‌హిస్తున్నాయి.

Also Read : పద్మావతి అమ్మవారి ఆలయానికి స్వర్ణ పాదాలు విరాళం

సిద్ధూ మూసేవాలా హ‌త్య కేసులో ఎన్ఐఏ ప్ర‌త్యేక విచార‌ణ ఏమీ చేప‌ట్ట‌డం లేద‌ని, కానీ గ్యాంగ్‌స్ట‌ర్ నెట్‌వ‌ర్క్‌పై స‌ప‌రేట్ కేసుల‌ను రిజిస్ట‌ర్ చేశామ‌ని, ఈ త‌నిఖీలు వాటికి సంబంధించిన‌వే అని ఎన్ఐఏ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌, బాంభి గ్యాంగ్‌, నీర‌జ్ బ‌వానా గ్యాంగ్‌తో పాటు ఇత‌ర గ్యాంగ్‌స్ట‌ర్ల‌పై ఎన్ఐఏ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది. నీర‌జ్ షెరావ‌త్ అలియాస్ నీర‌జ్ బ‌వానా గ్యాంగ్‌.. ఫేమ‌స్ వ్య‌క్తుల హ‌త్య కేసుల్లో నిమ‌గ్న‌మ‌వుతోంది. ఆ గ్యాంగ్ సోష‌ల్ మీడియాలో టెర్ర‌ర్ వ్యాపింప‌చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube