పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు‌

దేశవ్యాప్తంగా 100 మంది అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు‌
– దేశవ్యాప్తంగా 100 మంది అరెస్ట్‌
టీ మీడియా,సెప్టెంబర్ 22, న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. కేరళ, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్నది. ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు.

Also Read : పాదయాత్రకు కదులుదాం

ఈ దాడుల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడంతోపాటు శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 200 మందికిపైగా ఎన్‌ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇండ్లలో సోదాలు జరుపుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube