రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న శుక్రా

రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న శుక్రా

1
TMedia (Telugu News) :

రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న శుక్రా

టీ మీడియా,నవంబర్ 5,భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఏఎన్‌ఎం ఎండీ శుక్రా ఈనెల 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా నైటింగేల్‌ అవార్డు అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయస్థాయిలో విశిష్ట సేవలందించిన ఏఎన్‌ఎంలకు అందించే ఈ అవార్డుకు 2020లో శుక్రా ఎంపికయ్యారు.కొవిడ్‌ కారణంగా గతేడాది రాష్ట్రపతి కొవింద్‌ వర్చువల్‌ పద్ధతిలో అందజేశారు.

Also Read : మధ్యాహ్నం వరకు తుది ఫలితం

అదే అవార్డును ఈనెల 7న దిల్లీలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందించేందుకు కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు శుక్రా పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం శుక్రా దంపతులు దిల్లీ వెళ్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube