నిమ్స్ కు రూ. 1,571 కోట్ల నిధులు కేటాయింపు

నిమ్స్ కు రూ. 1,571 కోట్ల నిధులు కేటాయింపు

1
TMedia (Telugu News) :

నిమ్స్ కు రూ. 1,571 కోట్ల నిధులు కేటాయింపు

టీ మీడియా, నవంబర్ 16, హైద‌రాబాద్ : తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల రోగుల‌కు నిమ్స్ ఆస్ప‌త్రి అత్యుత్త‌మ వైద్య సేవ‌లందిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ ఆస్ప‌త్రిలో ప్ర‌తి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. ఇటు రాష్ట్రంలోని న‌లుమూల‌ల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల కోసం వైద్యానికి వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో నిమ్స్ విస్త‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో నిమ్స్ విస్త‌ర‌ణ‌కు రూ. 1,571 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. నిమ్స్ విస్త‌ర‌ణ ప్రాజెక్టుకు ప‌రిపాల‌న అనుమ‌తుల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింది.నిమ్స్ విస్త‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 1,571 కోట్ల నిధులు కేటాయించ‌డంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Also Read : మార్కెట్‌ కమిటీలో మౌలిక సదుపాయాలకు సానుకూలత

ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో ఈ నిర్ణ‌యం మ‌రో ముంద‌డుగు అని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఆరోగ్య రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube