ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

 ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

0
TMedia (Telugu News) :

 ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు

టీ మీడియా, ఫిబ్రవరి 18, హైదరాబాద్ : దేశంలోని పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతను ఇచ్చారు.

ఏ రాష్ట్ర ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదని స్పష్టం చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం ఒడిశా చేస్తున్న ఒత్తిడిని కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? అనే ప్రశ్నకు బదులుగా సమాధానమిస్తూ ఈ మేరకు స్పందించారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేసిందని తెలిపారు.

Also Read : మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు మరోసారి సీబీఐ సమన్లు

ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలకు స్పెషన్ స్టేటస్ ను కూడా ఆమె ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో… ప్రత్యేక హోదాను ఇవ్వాలనే డిమాండ్ ను పరిగణనలోకి తీసుకున్నారని… అయినప్పటికీ హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని ఫైనాన్స్ కమిషన్ స్పష్టమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube