దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయి

దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయి

1
TMedia (Telugu News) :

దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయి:

టి మీడియా, హైదరాబాద్‌: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయి ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నిరసన జ్వాలలు దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయని దుయ్యబట్టారు.‘అగ్నివీర్‌ పథకంపై జరుగుతోన్న ఈ హింసాత్మక ఆందోళనలు.. దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే కచ్చితమైన సూచికలు. అప్పుడు దేశ అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు.

Also Read : త్వ‌ర‌లో అగ్నిప‌థ్ షెడ్యూల్: ఆర్మీ చీఫ్‌

ఇప్పుడేమో దేశ జవాన్లతో ఆడుకుంటున్నారు. మొన్న ‘ఒకే ర్యాంక్‌ – ఒకే పింఛను’ విధానం.. నేడు ‘ర్యాంకు లేదు – పింఛను లేదు’ అనే ప్రతిపాదన’’ అని కేటీఆర్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు.
అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు హైదరాబాద్‌కు విస్తరించాయి. నేటి ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube