కాంగ్రెస్ పై నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు
టీ మీడియా, నవంబర్ 2, పాట్నా: కాంగ్రెస్ పార్టీపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ సర్కార్‌పై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కూటమిలో జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించిందని, ఇండియా కూటమి గురించి ఆ పార్టీ పట్టించుకోవడం లేదని సీఎం నితీశ్ కుమార్ ఆరోపించారు. పాట్నాలో సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న బీజేపీ హటావో, దేశ్ బజావో ర్యాలీని ఉద్దేశిస్తూ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడారు.
Also Read : ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తథ్యం..సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ
బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమిని ఏర్పాటు చేసింది నిజమే కానీ, ఆ దిశగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పనిచేయడంలేదన్నారు. అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పనిచేస్తున్నామని, కానీ ఆ పార్టీ మాత్రం ఈ అంశంలో ఆసక్తిగా లేనట్లు తెలుస్తోందన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube