మంథని కి బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు

మంథని కి బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు

0
TMedia (Telugu News) :

మంథని కి బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు

టీ మీడియా, డిసెంబర్ 27, పెద్దపల్లి బ్యూరో : కాల్వ శ్రీరాంపూర్ జమ్మికుంట మంథని బస్సును మళ్ళీ పునరుద్దరించాలని వివిధ గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.గతంలో మంథని, ఓడేడు మీదుగా జమ్మికుంట కు బస్సు ఉండేదని, గత కొన్ని రోజుల నుండి ఈ బస్సును నిలిపివేయడంతో మంతని లో ని పుణ్యక్షేత్రాలకు వెళ్లి గంగ స్నానం చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని,సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో,ప్రైవేట్ వాహనాల కోసం ఎదురుచూడాల్సి వస్తుందని,ప్రయాణం లో ఇబ్బందులకు గురితున్నామని మహిళలు, ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. మంథని ఓడేడు నుండి కాల్వ శ్రీరాంపూర్, మొట్లపల్లి,కిష్టంపేట, మీర్జాం పెట,గుంపుల, తనుగుల, నాగంపేట బిజిగిరి షరీఫ్ మీదుగా జమ్మికుంట కు వెళుతుండదని,మళ్లీ సాయంత్రం ఓడేడుకు వచ్చి రాత్రి ఒడేడు గ్రామం లోనే బస చేసి మళ్లీ ఉదయాన్నే జమ్మికుంటకు బయలుదేరి వెళ్ళేది ఉదయాన్నే వెళ్లే ప్రయాణికులకు కొంత సౌకర్యంగా ఉండేది, కనుక స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు,ఈ బస్సును మళ్ళీ పున ప్రారంభించాలని,తమ ఇబ్బందులు తొలగించాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Also Read : వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా : జనసేన లో చేరిక

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube