గ్రామంలో కుల వివక్ష చూపరాదు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 31 వనపర్తి : పెబ్బేరు మండలం కొత్తసూగురు గ్రామంలో గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పౌరుల సమానత్వ హక్కు అవగాహన సదస్సు నిర్వహించి పౌరుల సమానత్వపులపై ప్రజలకు అవగాహన కల్పించారు. పెబ్బేరు మండల రెవెన్యూ అధికారులు ఆర్ఐ రాములు, మరియు వీఆర్వో శంకర్ ,గ్రామ ప్రజలకు కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎవరైనా కుల వివక్షత చూపిస్తూ కులం పేరుతో దూషించిన పోలీసువారికి సమాచారం అందజేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి యాదగిరి, జి.రంగన్న, జి.వెంకటయ్య ,జె.నాగరాజు, జె.ఆంజనేయులు, జె. కురుమూర్తి, డి.రాముడు తదితరులు పాల్గొన్నారు.

No Caste discrimination in the village.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube