బాల్యవివాహాలు వద్దు బాలల హక్కులే ముద్దు

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 26, చింతూరు :

బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా శుక్రవారం చింతూరు మండలంలో గల యర్రంపేట కస్తూరి బా పాఠశాల లో ఐ సి డి ఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటిడిఎ ఎ పి వో సూర్యనారాయణ బాలల హక్కుల పరిరక్షణ ప్రతినిధి గాంధీ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తొలుత జ్యోతి ప్రజ్యోలన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలలు నేటి తరంలో పోటీ ప్రపంచంలో మున్ముందుకు వెళ్లాలని, ప్రభుత్వం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ భాద్యతలను కూడ నెరవేర్చలన్నారు. ప్రభుత్వం బాలల హక్కులకై అనేక చట్టాలు ప్రవేశపెట్టిందని, ప్రభుత్వం ద్వారా నడిచే వసతి గృహాల్లో ప్రైవేటు యాజమాన్యం కంటే మెరుగైన పౌస్టిక ఆహారం అందిస్తుందన్నారు. పై చదువులు చదివేందుకు ప్రోత్సహకాలు ప్రవేశపెట్టిందన్నారు. బాల్య వివాహాలు అరికట్టెందుకు చట్టాలు ఏర్పాటుచేసి బాలల హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడుతుందన్నారు.

No child marriages

ప్రతి ఒక్కరు తమ హక్కులను తెలుసుకొంటూ ఉపాధ్యాయుల సూచనలు పాటించి పాఠశాలకు తమ గ్రామానికి కన్న తల్లి దండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని తెలిపారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమలో విద్యార్థి నులు పాటలు, నృత్యలు ప్రదర్శించారు. బాల్య వివాహాలు అరికట్టెందుకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు గాంధీ బాబు. ఎ. పి. వో. ఐ. సి. డి. ఎస్. సి డి. పి. వో. శ్రీవిద్య. ఏటి డబ్ల్యూ. వో. రామ తులసి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో రాబిన్ హుడ్ స్వచ్చంద సంస్థ, ఎటపాక. సి డి. పి వో. షేక్ శంషాద్ బేగం, సూపర్ వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

No child marriages
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube