ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు

ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు

1
TMedia (Telugu News) :

 

ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు

టీ మీడియా, జూన్ 24, వనపర్తి బ్యూరో :ముప్పై వార్డు స్వయానా వైస్ చైర్మన్ వార్డు
అఖిలపక్ష ఐక్య వేదిక పరిశీలనచేస్తూ, ఐక్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా 30 వ వార్డులో గెలిచిన కౌన్సిలర్, వైస్ చైర్మన్ అయిన తరువాత వార్డు అభివృద్ధి జరుగుతుంది అందరూ సంతోషించారు కానీ ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్న చందంగా ఉంది. ప్రజలకు పలు హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మొండిచేయి చూపించడం జరిగిందని ఐక్య వేదిక వార్డుల సందర్శనలో భాగంగా పేర్కొంది. ఇప్పటివరకు పలు వార్డుల్లో తిరుగుతూ నిన్న ఈరోజు 30 వార్డులో పలు సమస్యలు కాదు కాదు వందల సమస్యలు ఉన్నవార్డు గా గుర్తించింది ఈ కౌన్సిల్ లో వార్డులో లక్షా రెండు లక్షల పని తప్ప ఎక్కడ పనులు కాలేదు. మంత్రి ఒక ఉద్యోగి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇచ్చిన హామీ మేరకు జంగిడిపురం నుండి నాగవరం వెనక ఆర్టీసీ కాలనీ వరకు మిషన్ భగీరథ ద్వారా రోడ్డు మాత్రమే వేయడం జరిగింది.

Also Read : రాజ్య‌స‌భ స‌భ్యులుగా దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌థి ప్ర‌మాణం

కానీ మున్సిపాలిటీ నుండి ఇలాంటి శాశ్వత పనులు కాలేదు దీన్నిబట్టి నాయకులు ఫోటోలు దిగడం తప్ప ఇలాంటి పనులకు శ్రద్ధ చూపడం లేదని ప్రజలు చెబుతున్నారు. పీర్ల గుట్ట నుండి వచ్చే వరద కాలనీ ముంచెత్తుతూ పలు ప్లాట్లను చెరువులను కనిపించేవిధంగా జలమయమై ఆ తరువాత బురద మయమై దోమలు ఈగలతో పలు రోగాలు వస్తున్నాయి . అలాగే కొన్ని కాలనీల్లో రోడ్లు లేక కనీసం నడవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల విభజన సమయంలో రాజకీయ దురుద్దేశంతో ఈ వార్డును తాడు బొంగరం లేని విధంగా తయారు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంపాదనే తన ధ్యేయం అన్నట్లు వైస్ చైర్మన్ గారు చెరువు కట్టను ధ్వంసం చేసే రియల్ ఎస్టేట్ వారికి అమ్ముకోవడానికి చూశాడు కానీ వార్డు అభివృద్ధి మాత్రం చేయలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. మేము పర్యటన చేసినప్పుడు ప్రజలు అంటున్న మాటలే మేము చెబుతున్నాము.

Also Read : జలకళను సంతరించుకున్న పొచ్చర జలపాతం

కనుక కమిషనర్ ,చైర్మన్, వైస్ చైర్మన్ ముప్పై వార్డు పట్టించుకుని ప్రజల కష్టాలను తీర్చాలని ముఖ్యంగా సాయినగర్ కాలనీ వెనకవైపు మట్టి రోడ్డు ధ్వంసమైంది దాంతో రామన్ పాడు పైపులు తేలి దాన్ని ప్రజలు వైస్ చైర్మన్ గారు చెప్పిన కూడాదానిపై మట్టి వేయలేక పోతున్నాడు. కానీ మట్టి వేసినట్లు 80000 కౌన్సిల్ మీటింగ్లో తీర్మానం చేయించుకున్నారు ఈరోజు కు వార్డులో రోడ్డు వేయడం ఎందుకు కూలగొట్టిన మట్టి తప్ప ఎలాంటి మట్టి వేయలేదు. వేసినా కూడా నమ్మ చెరువు కట్ట మట్టి మాత్రమే వేశాడు. అని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, చిరంజీవి, వెంకటేష్, రాజనగరం రాజేష్,భాస్కర్, తదితరులు మాట్లాడుతూ వనపర్తి లో పలు వార్డుల్లో కౌన్సిలర్లు పనిచేయడం లేదని ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టడం తప్ప ప్రజలకు అవసరమైన పనులు చేయడం లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube