అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు

అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు

0
TMedia (Telugu News) :

అభిమానులు ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు
– ఎమ్మెల్యే హరీశ్‌ రావు

టీ మీడియా, డిసెంబర్ 8, హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్‌ రావొద్దని అభిమానులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్‌ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు తెలిపారు.

Also Read : ప్రజాభవన్​ వద్ద క్యూ కట్టిన జనం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube