నో” ఫైర్ సేఫ్టీ

ప్రమాదం అంచున నిర్మాణాలు

1
TMedia (Telugu News) :

“నో” ఫైర్ సేఫ్టీ

– ప్రమాదం అంచున నిర్మాణాలు

– అక్యుపెన్సి సర్టిఫికెట్లు విష యం లోను అక్రమాలు

– చట్టవిరుద్ధంగా విద్య,వైద్య శాలలు,ఫంక్షన్ హాళ్లు

టీ మీడియా,నవంబర్ 7,ఖమ్మం: మంత్రి పువ్వాడ నేతృత్వం లో ,ఆయన కృషి తోమహానగరాల సరసన చేరుతున్న ఖమ్మం నగరం తో పాటు జిల్లాకొంతమంది చేస్టలు మూలంగా ప్రమాదం అంచుకు వెళుతోంది. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండ చేస్తున్న నిర్మాణాలు దడ పుట్టిస్తున్న యి. ఫైర్ సేఫ్టీ ధరకాస్తు ల వివరాలు,అనుమతులు తదితర జిల్లా కు చెందినవివరాలు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో 2018 వి మాత్రమే దర్శనం ఇవ్వడం అక్రమం స్థాయిని తెలియ చేస్తోంది. ముఖ్యంగ అక్యుపెన్సి సర్టిఫికెట్లు లేకుండానే చట్ట విరుద్ధం గా కార్పొరేట్ విద్యా సంస్థలు,మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రలు నిర్వహిస్తున్న రు. జాబితాలో ఫంక్షన్ హాల్స్ ఉన్నయి.కొన్ని హోటల్స్ ,డు ప్లేక్స్ ఇళ్లు కూడా ఉన్నయి.ఫైర్ సేఫ్టీ రీజినల్ స్థాయి అధికారి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ లు ,స్థానిక అధికారులు మ్యాన్యువల్ పద్దతి లో జారి చేసి లక్షల్లో దండు కొంటున్న రు అనే ఆరోపణలు ఉన్నయి. టపాసులు షాప్ లు వారీ వద్ద మిగిలిన సరుకు నిల్వలు పలు ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీకి విరుద్ధం గా ఉన్నయి. ఇందుకు సనందించి టీ మీడియా బృందం క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలన లో కోట్లు రూపాయిల అవినీతి రాకెట్ నడుస్తోంది అనేది తెలిసింది .

Also Read : అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10 శాతం కోటా : సుప్రీంకోర్టు

ఎవరికి అనుమతులు కావాలి

చట్ట ప్రకారం .ప్రేలుడు పదార్థాలు ముఖ్యంగా భాణ సంచ లాంటివి నిల్వ లు కు,విద్య, వైద్య శాలలు ఏర్పాటు,ఫంక్షన్ హాలు లు లాంటివి నిర్వహణకు ,15 మీటర్లు,అంతకు పైన ఎత్తు లో చేసే బహుళ అంతస్తులు కు, హోటళ్లకు అంటే ఎక్కువ జనం సమీకృతం అయ్యే వ్యాపార సంస్థ లు ప్రతి ఓక్కటి ఫైర్ శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం..నగరం లోని ప్రముఖ కార్పొరేట్ వైద్య శాల యాజిమన్య ప్రతినిధి గా ఉన్న,డాక్టర్ ఓకరు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో ఉన్న తన ఫామ్ హౌస్ లో నిర్మాణం చేసిన మినీ ఫంక్షన్ హాలు కు ఫైర్ సేఫ్టీఅనుమతులు తీసుకొని ఆదర్శం గా నిలిచారు. నగరంలో మాత్రం అందుకు విరుద్ధం గా కొన్ని నిర్మాణాలు,వ్యాపార సంస్థ లు ఉన్నయి.

నిబంధన ల ప్రకారం..
బహుళ అంతస్తు ల భవన నిర్మాణ సమయం తో పాటు,వాటిలో వ్యాపార సంస్థలు ఏర్పాటు సందర్భం లో ను అగ్ని మాపక శాఖ నుండి ఎన్ ఓ సి అవసరం.అందుకు ఆన్లైన్ ధరకాస్తు తో పాటు,సైట్ ప్లాన్,బెస్మెట్ ఫ్లోర్ ప్లాన్ ,గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్,ఫ్లోర్ వైజ్ బొలన్,టెర్రస్ ప్లాన్,సెక్షన్ ప్లాన్ తో పాటు మరికొన్ని అవసరం.15 మీటర్లు లోపు నిర్మాణం అయితే 7 రోజులు,15 మీటర్లు దాటితే 15 రోజుల్లో ఫైర్ శాఖ ధరకాస్తు పరిశిలన పూర్తి చేస్తుంది. బహుళ అంతస్తల భవనాలు , (డుప్లెక్స్ లు తో సహా) అయితే 7 మీటర్లు చొప్పున నాలుగు వైపుల విడిచి పెట్టాలి అని ఫైర్ సర్వీస్ యాక్ట్ 1999, అండర్ సెక్షన్ 31,32 చెపుతోంది.ధరకాస్తు చెయ్యని వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు.చేసిన వారీ ధరకాస్తు లు లోని వివరాలు నిబంధన ల మేరకు లేవు అని తిరస్కరణ కు గురి అయ్యాయి. అన్ని సరిచేసి తిరిగి ధరకాస్తు లు చేయకుండానే నిర్మాణాలు,నిర్వహణ లు చేస్తున్నట్లు పరిశీ లన లో వెల్లడి అయింది

Also Read : పక్షవాతం గుట్టువిప్పిన యూనివర్సిటీ పరిశోధకులు

అక్యుపెన్సి సర్టిఫికెట్
—-
విద్య ,వైద్య సంస్థలు నిర్వహిస్తున్న. భవన సముదాయం లో,మరొక రకమైన వి కూడా ఉంటే అగ్నిమాపక శాఖ నుండి అ క్యు సర్టిఫికెట్ తీసు కోవాలి.ఉదాహరణకు నగరం లో నీ పులిపాటి కళాశాల భవన సముదాయం లో విద్య సంస్థ తో పాటు రెండు వేర్వేరు గా రెండు ఆస్పత్రులు ఉన్నయి.వైరా రోడ్ లోని శ్రీ చైతన్య కళాశాల,మామూళ్ల గూడెం లోని వెలసిటి జూనియర్ కళాశాల లాంటి వి అన్నింటికీ అక్యుపెన్సి సర్టిఫికేట్ అవసరం.ఉన్నాయా అన్న విషయాలు పై సందేహాలు ఉన్నయి..ఏ ఒక్క నిర్మాణం కు నలు వైపుల ఫైర్ ఇంజన్ తిరిగే స్థలం లేదు.అయిన కోట్లు రూపాయల వ్యాపారాలు నడుస్తున్న యి.

వీటికి అనుమతులు ఉన్నాయా..

అగ్ని మాపక శాఖ నివేదికల ప్రకారం నగరం లో అగ్నిమాపక ఎన్ ఓసి కోసం చేసిన వారి కొన్ని ధరకాస్తు లు తిరస్కరణ కు గురి అయ్యాయి.
-వాటిలో పొట్టి శ్రీరాములు రోడ్లోని ఇంటి నెంబర్ 2-5-59 నుండి 63 వరకు ఉన్నగరికపాటి విజయ్ కమర్షియల్ బిల్డింగ్

– ఖానాపూరము లోని కొల్లూరి ఏసి గార్డెన్స్,సత్తుపల్లి సిద్దరం రోడ్ లోని ఏం అర్ గార్డెన్స్,ఖమ్మం బురాన్ పురం లోని హరిత స్కూల్,సత్తుపల్లి లోని వివి విద్యాలయం , ఖమ్మం నగరం ధం ఏం ఏం అర్ (మందడపు మనోహర్ రావు) గార్డెన్స్ లాంటి వాటికి ప్రోఫిష నల్ సర్టిఫికెట్ లు తిరస్కరణ కు గురి అయ్యియి.

Also Read : ముగ్గురిపై దాడిచేసిన ఎలుగుబంటి .

ఆక్యుపెన్సి సర్టిఫికెట్ లలో ను తిరస్కరణ

– నగరం లోని కొత్త కొత్తూరు ఏస్ ఎఫ్ ఎస్ ప్రమరి స్కూల్,మధిర సుందరయ్య నగర్ లోని శ్రీ లక్ష్మి శ్రీనివాస థియేటర్ , ఖమ్మం నగరం పా లోని హార్వెస్ట్ కో – ఆపరేటివ్ జూనియర్ కళాశాల ,శ్రీనివాస నగర్ లోని కోయాస్ స్కూల్ తో పాటు పలువురు ఫైర్ ఎన్వోసి ధరకాస్తులుతిరస్కరించారు.అయిన వీటిలో కొన్ని నిర్వహణ లోనే ప్రమాదం అంచున ఉన్నయి.ఇవికాక ఖమ్మం పరిసరాల్లో 500ల కు పైగా ఫైర్ నిబంధనలు కు విరుద్ధం గా చేసిన నిర్మాణాలు,సంస్థలు ఉన్నట్లు పరి సిలనలో వెల్లడి అయింది.నిబంధనలకు విరుద్ధం గా కొన్నింటికి స్థానిక ఫైర్ ఆఫీసర్ లు మ్యాన్యు
వల్ ఎన్ వో సిలు జారి చేసి,మున్సిపల్,ఇతరత్ర అనుమతులు పొందడానికి సహకరించి నట్లు కూడా వెల్లడియింది.కొన్ని సర్టిఫికెట్లు కు నిర్మాణం,నిర్వహణ బట్టి లక్షలలో చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నయి.(మరి కొన్ని వివరాలు మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube