ఒకరిద్దరు వెళ్ళిపోయినా టీడీపీ కీ నష్టం లేదు

ఒకరిద్దరు వెళ్ళిపోయినా టీడీపీ కీ నష్టం లేదు

0
TMedia (Telugu News) :

ఒకరిద్దరు వెళ్ళిపోయినా టీడీపీ కీ నష్టం లేదు

– టిడిపి రాజారెడ్డి

టీ మీడియా, నవంబర్ 1, పెద్దమందడి : కాసాని వ్యాఖ్యల్ని తప్పుబట్టిన నేతలు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన టిడిపి నాయకులు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెదేపాకు కార్యకర్తలే బలం, బలగమని. ఒకరిద్దరు నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన బలహీనపడదని ఆ పార్టీ నాయకులు స్పష్టంచేశారు. తెదేపా ముఖ్యనేతలు బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా అడ్డాకుల మండలం టిడిపి అధ్యక్షులు గుడిబండ సత్యనారాయణ మాట్లాడుతూ.. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా, కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లారంటూ కాసాని జ్ఞానేశ్వర్‌ మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి లపై మండిపడ్డారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా వ్యవహరించారనీ పార్టీ రాష్ట్ర కమిటీలన్నింటినీ రద్దు చేశారన్నారు. కొందరు వ్యక్తుల కోసం పార్టీ నిర్ణయాలు ఉండవని అన్నారు. దేవరకద్ర టిడిపి ఇన్చార్జ్ జనార్ధన్ మాట్లాడుతూ కాసాని అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వలేదని ఆక్షేపించారు. జాతీయ నాయకత్వం కోర్‌కమిటీ వేస్తే కాసాని సహకరించలేదని ఆర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read : రాహూల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్‌కు అధికారం పగటికలే

ఈ కార్యక్రమంలో పెద్దమందడి మండల టిడిపి అధ్యక్షుడు ఆర్.పెద్ద శ్రీనివాస్ రెడ్డి, అడ్డాకుల టీడీపీ మండల ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు కన్మనూరు రాజారెడ్డి, ఉపాధ్యక్షులు హుస్సేన్, ఉప సర్పంచ్ యాదయ్య, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, బలీదు పల్లి కరుణాకర్ రెడ్డి, దేవరకద్ర జనార్దన్ నాయుడు, కన్మనూరు వెంకటస్వామి, ఉప్పరిపల్లె రాజశేఖర్ రెడ్డి, గుడిబండ రామ్మూర్తి నాయుడు, బొక్కి చంద్రయ్య, కన్మనూర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube