ఎక్కడ పనిచేసినా కోట గుళ్ళ తో అనుబంధం ఉంటుంది

మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్ నాధ్ కెకాన్ ఐ.పి.ఎస్

0
TMedia (Telugu News) :

ఎక్కడ పనిచేసినా కోట గుళ్ళ తో అనుబంధం ఉంటుంది

– మంచిర్యాల డిసిపి సుధీర్ రామ్ నాధ్ కెకాన్ ఐ.పి.ఎస్

లహరి, జనవరి 28,మంచిర్యాల : ఉద్యోగరీత్యా ఎక్కడ పనిచేసినా గణపురం కోటగుళ్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని మంచిర్యాల డిసిపి గా నూతనంగా నియమితులైన సుధీర్ రామ్ నాధ్ కెకాన్ ఐ పి ఎస్ అన్నారు. సంవత్సరానికి పైగా ములుగు ఏ ఎస్పీగా సేవలందించిన ఆయన బదిలీ పై మంచిర్యాల వెళ్తూ శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నరేష్ ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గోశాల గోమాతలకు పండ్లను అందజేశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Also Read : తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube