మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు

మహాకరుణ అఖండ శాకాహార ర్యాలీ

0
TMedia (Telugu News) :

మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు

-మహాకరుణ అఖండ శాకాహార ర్యాలీ

లహరి,జనవరి30,ఖమ్మం : నగరం లో మమత హాస్పిటల్ రోడ్డు ఇ.ఆర్.ఆర్ గార్డెన్ నుండి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూమెంట్ – ఇండియా ( పీఎంసీ ) వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహా పత్రీజీ గురువు మార్గదర్శకత్వం లో ధ్యానులు అందరూ కలిసి మూగజీవుల పరిరక్షణకొరకు మహాకరుణ శాఖాహార ర్యాలీని నిర్వహించారు . మహాకరుణ అఖండ శాకాహార ర్యాలీ పలు సెంటర్లు మీదుగా మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు అని బారీ ర్యాలీ చేపట్టారు . అనంతరం వారు మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానం అని , మాంసాహారం వద్దు శాఖాహారం ముద్దు అని , మానవజాతి భూమి మీదకు వచ్చిన తర్వాత మొట్టమొదట ఆకులు , అలమలు , పండ్లు తిని జీవించాడని . కాలం మారుతున్న తరుణంలో మాంసాహారం గా మారాడని , మాంసం తినడం వల్ల కురమృగంగా మారుతాడని మానవ మనగడ కొన్ని వేల సంవత్సరాలు జీవించాలంటే శాఖాహారం భుజించాలని అన్నారు . మాంసాహారం వల్ల అనేక నష్టాలు కలుగుతాయని , శాఖాహారము వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు .

Also Read : ముగిసిన నాగోబా జాతర

మానవులు పూర్తిగా శాకాహారముగా మారినప్పుడే మానవజాతికి ఒక అర్థం ఉంటుందని తెలిపారు . జంతువులలో అనేక దేవుళ్ళు నిక్షితమై ఉంటారని కావున జంతు హింస మహా పాపమని అన్నారు . వాడవాడల్లో పిరమిడ్ లు ఏర్పాటు చేయాలని , సకల జనులకు ధ్యానం గురించి తెలియజేసి నేర్పించాలన్నారు . ధ్యానం సర్వరోగ నివారిణి , ధ్యానం సకలభోగకారిణి , ధ్యానం సత్య జ్ఞానప్రసాదిని తెలిపారు . ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారు మరం ప్రసాద్ , భాస్కర్ రెడ్డి , సొసైటీ అధ్యక్షులు శైలజ మేడం , ఆనంద్ , ప్రసాద్ , సీతయ్య , పుల్లకొండ వెంకటేశ్వరరావు , విజయలక్ష్మి , రాజర్షి రాజశేఖర్ , మన్యం కృష్ణ తదితరాలు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube