కనీస సౌకర్యాలు కరువు

కనీస సౌకర్యాలు కరువు

1
TMedia (Telugu News) :

కనీస సౌకర్యాలు కరువు

టీ మీడియా, మే 4, వనపర్తి బ్యూరో : ఖిల్ల ఘనపూర్ మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వం రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నా కనీసం మంచినీరు కూడా సరఫరా చేయకుండా రైతులకు రైతు కూలీలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏదో నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు అని పెట్టి చేతులు దులుపుకొని వదిలేసి తమకు ఏమాత్రం సంబంధం లేని విధంగా అధికార యంత్రాంగం ఉందని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ యూత్ నాయకులు వెంటనే వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రత అదుపులో ఉంచుకోవడానికి రైతులకు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయకర్, రమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube