పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు

పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు

1
TMedia (Telugu News) :

పేదలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వద్దు

-మంత్రి హరీశ్‌ రావు

టీ మీడియా, ఆగస్టు3, హైదరాబాద్‌: పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వైద్య పరికరాలు లేవనే సాకుతో పనిచేయకపోవడం మంచిదికాదన్నారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో రూ.20 కోట్లతో ఆధునీకరించిన ఈఎస్‌ఐ దవాఖానను మంత్రి మంత్రి మల్లారెడ్డితో కలిసి హరీశ్‌ రావు ప్రారంభించారు. పఠాన్‌చెరు ప్రాంతంలోని కార్మికులకు ఈఎస్‌ఐ దవాఖానాలో అన్నిరకాల వైద్య సదుపాయాలు కల్పించడం సంతోషంగా ఉన్నారు. అనంతరం దవాఖానను పరిశీలించారు.

 

Also Read : రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ చూశారా?

డాక్టర్లు ఫుల్‌.. పేషెంట్లు నిల్‌
ఈఎస్‌ఐ దవాఖాన పనితీరుపై మంత్రి హరీశ్‌ రావు అసహనం వ్యక్తంచేశారు. దవాఖాన వివరాలు ఇవ్వకపోవడంతో సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నలుగురు వైద్యులు నాలుగేండ్లుగా విధులకు రావడంలేదని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అదేవిధంగా హాస్పిటల్‌లో ప్రసవాలు ఎందుకు చేయడం లేదని సూపరింటెండెంట్‌ను నిలదీశారు.
జూలై నెలలో మూడు డెలివరీలు మాత్రమే చేయడంపై సీరియస్‌ అయ్యారు. ఇక్కడ పనిలేకుండే పటాన్‌చెరు దవాఖానలో డ్యూటీ చేయాలని ఆదేశించారు. హాస్పిటల్‌లో డాక్టర్లు ఫుల్‌గా ఉన్నప్పటికీ పేషెంట్లు నిల్‌ అని చెప్పారు. వైద్యపరికరాలు లేవనే సాకుతో డాక్టర్లు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వృత్తికి న్యాయం చేయాలని వైద్యులను కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube