ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు నో పర్మిషన్‌

ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌

1
TMedia (Telugu News) :

ఓయూలో రాహుల్‌ గాంధీ సభకు నో పర్మిషన్‌

-ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌
టీ మీడియా, ఏప్రిల్ 30, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్‌. అంతేకాదు.. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది.

Also Read : ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు

కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ వద్ద రాహుల్‌గాంధీ.. విద్యార్థులతో మమేకం అవుతారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పుడు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube