టీఆర్ఎస్ తోనే నిరుద్యోగులకు బంగారు భవిష్యత్
కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం
టీ మీడియా,మార్చి 9,కరకగూడెం:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు భర్తీ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ప్రకటన చేయడం నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని టీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ అన్నారు.
బుధవారం కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఉద్యోగులు ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత ప్రభుత్వాలు
యువతను,నిరుద్యోగులు పట్టించుకున్న నాదుడే లేదన్నాడు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నేతృత్వంలో రాష్ట్ర సాధనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఉద్యోగ నియామకాలతో మరింత సర్వతోముఖావృద్ది రాష్ట్రంగా సాగుతుందని అన్నారు.టీఆర్ఎస్ పార్టీతోనే నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని,
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య,మండల నాయకులు రేగా సత్యనారాయణ,యూత్ వైస్ ప్రెసిడెంట్ గాందర్ల సతీష్,పినపాక నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడ రవి ,గొగ్గల నారాయణ,ఈసం సమ్మయ్య,ఈసం రామకృష్ణ,వినోద్,లక్ష్మీనారాయణ,యాకుబ్ ఖాన్,సురేష్,విజయ్,అభిరామ్,లవ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.