సాధారణ ప్రసవాలు పెంచాలి

కలెక్టర్ విపి గౌతమ్

0
TMedia (Telugu News) :

సాధారణ ప్రసవాలు పెంచాలి
కలెక్టర్ విపి గౌతమ్
టి మీడియా,మే,11 ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తణిఖీ చేసారు. నెలవారీ ప్రసవాలు, ఔట్ పేషెంట్ల వైద్యసేవలు, రక్త నమూనాల సేకరణ జిల్లా కేంద్రానికి పంపడం, గర్భీణీల నెలవారీ చెకప్లు తదితర వైద్యసేవలకు సంబంధించిన రిజస్ట్రర్లను కలెక్టర్ తణిఖీ చేసారు.

Also Read:చలి వేద్రం ప్రారంభం

ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవల పట్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఏ.ఎన్.ఎంలు, సూపర్వైజర్ల ద్వారా తెలియపర్చి ఉచిత వైద్య సేవలు, అవసరమైన వైద్య సదుపాయాలు పొందే విధంగా ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపర్చి గ్రామాలలో విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఔట్ పేషెంట్ల వైద్య సేవలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలందించడంతో పాటు మధుమేహం, రక్తపోటు కలిగిన వారికి ఉచితంగా మాత్రలను అందించి క్రమం తప్పకుండా వినియోగించేలా పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు.

Also Read:డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఉన్నత అధికారులు

గర్భిణీలు నెలవారీ చెకప్లకు వచ్చే సమయంలోనే వారికి సాధారణ ప్రసవాల వల్ల కలిగే సౌలభ్యం తెలియపర్చి సిజెరీయన్ వల్ల కలిగే అనర్థాల పట్ల చైతన్య పర్చాలని ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేయడంతో పాటు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక సిజేరియన్ ప్రసవాల వైపు మొగ్గుచూపకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు మరింత భాద్యతాయుతంగా విధుల పట్ల అంకిత భావం కలిగి ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా వివిధ రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సేకరించిన రక్త నమూనాలను ఏ రోజుకు ఆరోజు జిల్లా కేంద్రంలోని డయాగ్నస్టిక్ సెంటర్కు పంపించాలని కలెక్టర్ అన్నారు.
గ్రామ సర్పంచ్ యం.అశోక్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శాంతారాణీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Readకన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube