సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

1
TMedia (Telugu News) :

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి: కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

టీ మీడియా, ఎప్రిల్ 12,పెద్దపల్లిబ్యూరో: జిల్లాలో సాధారణ ప్రసవాలు సంఖ్య పెంపొందించే దిశగా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రైవేట్ వైద్యులను కోరారు. సోమవారం
జిల్లాలో జరుగుతున్న ప్రసవాల పై వైద్య శాఖ అధికారులతో కలిసి ప్రైవేట్ వైద్యులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో అత్యధికంగా సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని, అదేవిదంగా మన పెద్దపల్లి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజెరియన్ ప్రసవాలు ఎక్కువ జరుగడం విచారకరమని అత్యధికంగా సిజేరియన్ ప్రసవాలు జరగడానికి గల కారణాలను కలెక్టర్ ప్రైవేట్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సిజేరియన్ ప్రసవం వల్ల వచ్చే నష్టాలను వైద్యులు పేషెంట్లకు వివరించాలని, సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు.సాదారణ ప్రసావాలపై ప్రజల్లో అవగాహనా కల్పించాలని ఆశ, ANM లు గర్భవతులను నమోదు చేసుకొన్నప్పటినుండి కాన్పు వరకు వారిని సాదారణ ప్రసావాలకై ప్రోత్సాహించాలి అని ఆదేశించారు.

also read : వీడ్కోలు సమావేశ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉన్నాయని, మన జిల్లాలో మాత్రం అత్యధిక సిజేరియన్ లు నమోదు అవుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం అధిక సిజేరియన్ కేసులు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం సిజేరియన్ కేసులు తగ్గించే దిశగా చర్యలు చేపట్టామని, ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ దిశగా చర్యలు తీసుకొని సహకరించాలని కలెక్టర్ కోరారు.
సిజేరియన్ ప్రసావాలు తగ్గించే దిశగా ఇప్పటినుండి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రజలలో సాధారణ ప్రసావాల వల్ల లాభాలు మరియు సిజేరియన్ ప్రసవాల వల్ల జరిగే నష్టాలు తెలియచేయాడానికి అవగాహన కార్యక్రమాలు జిల్లా వైద్యశాఖ చేపడుతుందని తెలియచేసారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డి పి హెచ్ ఎస్ డాక్టర్ మందల వాసుదేవరెడ్డి, వైద్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube