బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

2
TMedia (Telugu News) :

బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

టీ మీడియా, నవంబర్ 2, సియోల్‌ : ఉత్తరకొరియా మరోసారి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. తూర్పు సముద్ర తీరం వైపు కిమ్‌ సైన్యం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని బుధవారం ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. అమెరికా-దక్షిణకొరియా సైన్యాలు భారీస్థాయిలో సంయుక్త గగణతల విన్యాసాలు నిర్వహించిన నేపథ్యంలో హెచ్చరికగా ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలిపింది.

Also Read : భ‌ర్త అంగీకారం లేకున్నా మ‌హిళ‌లు విడాకులు తీసుకోవ‌చ్చు

తూర్పు సముద్రం వైపు ఉత్తర కొరియాకు చెందిన ఓ క్షిపణిని దూసుకెళ్లిందని సియోల్‌ సైన్యం పేర్కొన్నది. తూర్పు సముద్రాన్ని జపాన్‌ సముద్రం అనికూడా పిలుస్తారు. కాగా, గత వారం రోజుల్లో జపాన్‌వైపు క్షిపణులను ప్రయోగించడం ఇది రెండోసారి. గత నెల 28న ఇదేతరహాలో తూర్పు సముద్రంవైపు బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను పరీక్షించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube