డ్రగ్స్ కు బానిస కావద్దు

నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు

0
TMedia (Telugu News) :

డ్రగ్స్ కు బానిస కావద్దు

– నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు

-తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలి

ఎస్పీ శ్రీమతి సింధు శర్మ

టి మీడియా, జూన్ 27, జగిత్యాల ప్రతినిధి:ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం* ను పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దు- బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారు యువతకు సూచించారు.డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమౌతుందని అన్నారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని అన్నారు. ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గదర్శనం చేయాలని అన్నారు.డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తు ను అందకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు.

 

Also Read : భ్రమరాంబమల్లికార్జున స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే

మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు.నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు.మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తెలుపుతూ తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. పోలీస్ శాఖ జిల్లాలో డ్రగ్స్ పట్ల యువతలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గడిచిన 2021 సంవత్సరం జిల్లాల లో గంజాయి కి సంబంధించి మొత్తం 14 కేసులు నమోదయ్యాయి ఇందులో 38 మoది ని అరెస్టు చేయడం తో పాటు 30.165 kgs ల గంజాయి ని సీజ్ చేయడం జరిగింది. 2022 సంవత్సరంలో జిల్లాల లో గంజాయి కి సంబంధించి మొత్తం 06 కేసులు నమోదయ్యాయి ఇందులో 23 మoది ని అరెస్టు చేయడం తో పాటు 11.20 kgs ల గంజాయి ని,11 గంజా మొక్కలను సీజ్ చేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube