ఎంత కష్టమొచ్చినా సరే వారి సాయం మాత్రం తీసుకోవద్దు : చాణక్య

ఎంత కష్టమొచ్చినా సరే వారి సాయం మాత్రం తీసుకోవద్దు : చాణక్య

0
TMedia (Telugu News) :

ఎంత కష్టమొచ్చినా సరే వారి సాయం మాత్రం తీసుకోవద్దు : చాణక్య

లహరి, జనవరి 30, ఆధ్యాత్మికం : మన జీవితంలో పరిచయం అయ్యే స్నేహితులు మంచివారు అయితే.. జీవితం కూడా విజయవంతంగా ముందుకు సాగుతుంది. అదే స్నేహితులు మోసగాళ్లు అయితే.. శత్రువుల కంటే ప్రమాదకరంగా మారుతారు. అలాంటి స్నేహితులను ముందే గుర్తించి, వారికి దూరంగా ఉండాలంటారు ఆచార్య చాణక్యుడు. ఇలాంటి వ్యక్తుల గురించి చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రంలో చాలా వివరాలు పేర్కొన్నారు. మనుషులు ఎవరికి దూరంగా ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి, ఎవరితో ఎలా ఉంటే జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయనే విషయాన్ని ఆయన వివరించారు. కొంతమంది పైకి మంచిగా నటిస్తూ.. వెనుకాల గుంతలు తవ్వుతూ ఉంటారు. మరి వారిని గుర్తించడం ఎలా? అలాంటి వారు ఎలా ఉంటారు? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మూర్ఖులకు దూరంగా ఉండాలి..
మీరు చేసే సహాయం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తికి సహాయం చేయాలని ఆచార్యుడు నీతిశాస్త్రంలో తెలిపారు. మూర్ఖుడికి సహాయం చేయడం వల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువగా ఉంటుంది. మూర్ఖుడు మంచి, చెడులను అర్థం చేసుకోడు. అలాంటి పరిస్థితిలో తిరిగి మీకే చెడు చేసే ప్రమాదం ఉంది.

అధర్మ మార్గాన్ని అనుసరించేవారికి దూరంగా ఉండాలి..
చాణక్యుడి ప్రకారం.. అధర్మ మార్గాన్ని అనుసరించే వ్యక్తికి ఎల్లప్పుడూ దూరం ఉండాలి. అలాంటి వారు తాము పాపాలు చేయటమే కాకుండా ఇతరులను కూడా చేయమని ప్రోత్సహిస్తారు. తన గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి, తన ప్రయోజనం కోసం ఇతరులకు ఎలా హాని చేయాలా? అని ఎప్పుడూ ఆలోచించే వ్యక్తికి ఎప్పుడూ సహాయం చేయకూడదు అని చాణక్యుడు చెప్పాడు. వీరి నుంచి కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ సాయం కొరొద్దు.

Also Read : ఈ గుడిలోకి వెళ్లిన భక్తులు దొంగతనం చేయాలని ఆరాటపడతారు

అసూయపరులు..
అసూయపరులకు అస్సలు సాయం చేయొద్దు. వీరు తమ అవసరానికి సాయం పొందిన తరువాత.. వదిలేసి వెళ్లిపోతారు. తమ స్వార్ధం కోసం ఎంత వరకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దూరంగా ఉండటం మంచిది. అసూయ భావాలు కలిగి ఉన్న వారు ఎప్పుడూ ఇతరులను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారి నుంచి ఆపద కాలంలోనూ సాయం కోరొద్దు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube